నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు..! 1 d ago
TG: కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిసాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు తెలిపింది. ఉదయం 10:30కి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరుకాకుండా కేటీఆర్ హైడ్రామా సృష్టిస్తున్నారు. విచారణ అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ పంపారు.